
M. Ganapathi
CORRESPONDENT

SHYBA MATHEW
HEADMISTRESS
ఒక్క మాటలో చెప్పాలంటే "ఒకవిషయం నేర్చుకోవాలనే కాంక్ష విధ్యార్ధులలో కలిగించకుండ వారికి విద్యాభోదన చేయడం ఎటువంటిదంటే చల్లని ఇనుము మీద సమ్మిటతో బాధడం వంటిది." విధ్యను ఆనందదాయకమైన కృషిగా మార్చడం, నేటి అతివేగ ప్రపంచంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పుకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజితో విద్యాభోదన చేయడం అత్యవసరము.
మన నిత్య జీవితములో అనేక మార్పులు సంభవిస్తున్నవి. రాకెట్లు మొదలుకొని, మీ ప్రియమైన టీ వీ కార్యాక్రమాలు, ప్రతిరోజూ చదివే దినపత్రికలలోను, మీ వ్యాపార కార్యాకలాపాలలోను,ఇలా చెప్పు కొంటూ పోతే మనిషి ప్రతి జీవితంలో కంప్యూటర్ పాత్ర ఎంతైనా వుంది. కంప్యూటర్ మనిషి జీవితముకి కేంద్రమైనది అయితే కంప్యూటర్ మనిషి మేధస్సును 'డి' కొనలేందు అన్న విషయం మనం మరవకుడదు. అయితే ఏ యంత్రానికైనా మనిషే సుఫీరీయర్, ఏది ఏమైనప్పటికి మన సమయాన్ని ఆదాచేయడనికి, సమాచారాన్ని చాలా కాలము భద్రపరచడానికి, యధార్ధవంతమైన పలితాలను పొందడానికి, మనం యంత్రం పై ఆధారపడక తప్పలేదు. అబివృద్ధి చెందిన దేశాలలో కంప్యూటర్ మర మనుషులచే పనులు చేయించుకొంటున్నారు. మన నిత్యజీవితంలో వానిని ఉపయోగించుకొనుట ఎంతైనా అవసరము ఉన్నది.
ప్రతి మనిషికి ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవి క్రీడలు. దృఢమైన శరీరములో ధృడమైన మనస్సు అని ఒక సామెత వుంది. వ్యక్తి సమగ్ర విషయములో వ్యాయమము, క్రీడలు ముఖ్య పాత్ర వహిస్తాయి. క్రీడలు యావత్తు విద్యాబోధన క్రమంలోని విడదీయరాని భాగంగాను పరిగనించబడుతున్నది. కనుక బాల్యదశ నుంచి విద్యార్థులలో క్రీడల పట్ల ఆశక్తి కల్పించవలసిన అవసరము ఎంతైనావుంది. క్రీడలుశరీరాన్ని దృఢపర్చి దైర్యాన్ని, పట్టుదలను, సమిష్టి కృషిని పాదుకొల్పుతాయి. ఇవి పాఠాలతో పాటు పాఠశాల అనంతర కార్యాకలాపాలు కూడా చాలా ముఖ్యము.
విద్యా సంస్థలు విద్యార్థులకు భోదిస్తున్న విద్యను నిత్య జీవితానికి ఉపయోగకరంగా భోదించాలి. అంతయూ కాక వారికి విద్యపై అవగాహన కల్పించాలి విద్యా ఉపయోగాలు ప్రతి బోదన తరగతుల యందు చెప్పాలి. ఇలా విద్యార్థులలో ఒక aim కల్పించి వారిని ఎంకరేజ్ చేస్తూ ఒక క్రమమైన పద్ధతిలో ప్రాధమిక విద్య నుండి నడిపించవలసిన బాధ్యత పాఠశాల యాజమాన్యం మరియు తల్లితండ్రలపై ఆధార పడియున్నది.
యం. గణపతి.,
కరెస్పాండెంట్,

